Jayasudha : నటి జయసుధ ఇంటర్వ్యూ
జయసుధ 1959 డిసెంబర్ 17న మద్రాసులో జన్మించారు. పుట్టి పెరిగినది మద్రాసులో అయినా మాతృభాష తెలుగే. నటి, నిర్మాత విజయనిర్మల ఈవిడకు మేనత్త . 1972 లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం జయసుధ మొదటి చిత్రం.
జయసుధ నటించిన 300లకు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సుమారు 25 సినిమాలు, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించింది. ఒకే సంవత్సరంలో జయసుధ నటించిన సినిమాలు 25 విడుదలయ్యాయి.
జయసుధ 1985లో హిందీ నటుడు జితేంద్రకు దాయాది అయిన నితిన్ కపూర్ ను పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. 1986లో మొదటి కొడుకు నిహార్, 1990లో శ్రేయంత్ పుట్టారు. జయసుధ 2001లో బాప్తిస్మము పుచ్చుకొని క్రైస్తవ మతస్థురాలైనారు. ఇటీవల అనారోగ్యముతో బాధపడుతూ వైద్య సహాయములేని పిల్లలకు సహాయము చెయ్యడానికి ఈమె ఒక ట్రస్టును కూడా ప్రారంభించారు.
إرسال تعليق