How to make goruchikkudu chutney
కావలసినవి :
గోరుచిక్కుళ్ళు - 15, పచ్చిమిర్చి జీలకర్ర - స్పూను, ధనియాలు - స్పూను, వెల్లుల్లి - 20 పాయలు, చింతపండు - నిమ్మకాయ సైజంత, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ, కొంచెం తరిగిన కొత్తిమీర, నూనె - స్పూను
తయారీ :
శుభ్రం చేసిన గోరుచిక్కుడు కాయల్ని చిన్న ముక్కలుగా తరగాలి. ఉల్లి ముక్కలు పక్క నుంచి, పైన చెప్పిన వాటన్నింటినీ బాండీలో నూనె వేసి, దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా పచ్చడి నూరుకోవాలి. చివరిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చడిలో కలిసేలా ఒక్కసారి పైపైన నూరాలి. చివరిగా తాలింపు పెట్టుకోవాలి. వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.
إرسال تعليق