కావలసినవి : చిక్కుడు కాయలు - 1/4 కేజీ, కొబ్బరి పాలు
- 100 మి. లీ., ఉప్పు - తగినంత, పసుపు - 1/4 స్పూను, కారం / పచ్చిమిర్చి పేస్ట్ - స్పూను, పల్లీ, నువ్వుల పొడి - 2 స్పూన్లు, నూనె గరిటె, ఆవాలు, పచ్చి శనగపప్పు, జీలకర్ర - స్పూను చొప్పున
తయారీ : ముందుగా బాండీలో నూనె వేడి చేసి, తాలింపు దినుసులు
వేయాలి. ఇవి దోరగా వేగిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి, సన్న సెగపై మగ్గనివ్వాలి. ఇప్పుడు కొబ్బరి పాలు పోసి, పావుగంట ఉడికించాలి. కూర గుజ్జుగా ఉండగానే కారం, పల్లీలు, నువ్వుల పొడి వేయాలి. గరిటెతో మొత్తం కలిసేలా తిప్పి, మూత పెట్టి ఒక నిమిషం ఉడకనివ్వాలి. తర్వాత పైన కొత్తిమీర తరుగు చల్లాలి. అంతే కొబ్బరిపాలతో చిక్కుడుకాయ కూర రెడీ.
إرسال تعليق