కావలసినవి: గోధుమ పిండి- 2 కప్పులు
పంచదార పొడి - ముప్పావు కప్పు పైనే(అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), ఉప్పు - కొద్దిగా, కుకింగ్ సోడా - చిటికెడు పుచ్చగింజలు - 1 టీ స్పూన్. సోంపు - 1 టీ స్పూన్ నువ్వులు - 2 టీ స్పూన్లు, నెయ్యి, నీళ్లు - పావు కప్పు చొప్పున నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, పంచదార పొడి, ఉప్పు,
కుకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో పుచ్చగింజలు, సోంపు, నువ్వులు, నెయ్యి, నీళ్లు పోసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఆ ముద్దను 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని మరోసారి బాగా మెత్తగా చేత్తో కలిపి.. చిన్న చిన్న బిస్కట్స్లో చేసుకుని.. నూనెలో దోరగా వేయించుకోవాలి.
إرسال تعليق