మన దేశంలో ఎక్కువశాతం ప్రజలను వేధిస్తున్న వ్యాధులలో మొదటిది మధుమేహమైతే, రెండవది థైరాయిడ్ గ్రంధి పనితీరులోపం. మధుమేహవ్యాధి గురిం చిన ప్రచారం, దాన్ని గుర్తించేందుకు తగిన సౌకర్యాలు లభ్యమవ టంతో దాని చికిత్సకు సంబంధించిన ఆం శాలు వెలుగులోకి వచ్చాయి. కాని థైరాయిడ్ గ్రంథి లోపం గురించిన విషయం చాలామందికి తెలియటంలేదు. డాక్టర్లుకూడా ఇటీవలి వరకు ఆ గ్రంథి పనితీరులో లోపం ఏర్పడితే కలిగే ఇబ్బందులగురించి అధ్యయనం చేయలేదు.
ఫలితంగా తమ అనారోగ్య సమస్యకి పరిష్కారం వైద్యులు గుర్తించలేక, చికిత్స మార్గంలేక చాలామంది అలా బాధపడుతున్నారు. మనిషి శరీరంలో కీలకపాత్ర వహించేవి వినాళ గ్రంధులు.
వినాళ గ్రంథులలో ఒకటి థైరాయిడ్, ఇది మనిషి గొంతుభాగంలో శ్వాసక్రియ జరిపేందుకు వీలు కల్పించే గాలిగొట్టాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది.
ఆకారంలో చిన్నది అయినా, జీవన క్రియలో కీలకం కైరాయిడ్ గ్రంది. ఈ గ్రంధి నుండి థైరాక్సిన్, ట్రై అయోడో థైరోనిన్అనే హార్మోన్లు వెలువడతాయి. రక్తంలో ఉన్న అయోడిని ఈ గ్రంధి గ్రహించి హార్మోన్ల తయారీకి వాడుకుంటుంది. ఈ హార్మోన్లు శరీరంలో అన్ని అంశాలు, కణాలు శక్తిని వినియోగించుకోవటాన్ని క్రమబద్ధం చేస్తాయి. థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేసినంతకాలం అనారోగ్య ఇబ్బందులుండవు. అయితే దానిలో లోపం ఏర్పడినప్పుడు శక్తి వినియోగంలో మార్పు వస్తుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి తగ్గుతుంది. చిరాకు పెరుగుతుంది. ఏ విషయంమీదా దృష్టి నిలపలేరు.
ఆదుర్దా ప్రదర్శిస్తుంటారు. ఈ లక్షణాలు మధ్య వయసుదాటిన తర్వాత కనిపిస్తే ఆ వయసులో సహజ మైనవమకుంటారు. మధ్యవయసులో ఏర్పడే మానె పిక సమస్యలవల్ల అటువంటి ప్రవర్తన ఉంటుందని భావిస్తారు. అంతేకాని థైరాయిడ్ గ్రంధిలోపం ఆ పరిస్థితిని తెస్తుందని అనుకోరు.
వయసుమళ్ళినవారు, నలభై సంవత్సరాల వయసు దాటిన స్త్రీలలో థైరాయిడ్ లోపాలు ఏర్పడుతుంటాయి.
![]() |
Thyroid tretment tips in telugu |
ఎప్పుడూ అలసిపోయినట్లుగా ఉండేవారు తరచుగా అనారోగ్యా నికి గురయ్యేవారు థైరాయిడ్ పెని తీరును పరీక్షించుకోవటం అవ సరం, రక్తపరీక్షద్వారా థైరాయిడ్ పనితీరును తెలుసుకోగలరు.
స్త్రీలలో అధికం చిరాకు, ఆదుర్దా వగైరాలు మహిళల్లో అందునా మధ్యవయసు వున్న వారిలో సహజం అనుకుంటారు. అయితే తాజా పరిశీలనల ప్రకారం వారి ప్రవర్తనలో వచ్చేటువంటి మార్పుకు కారణం థైరాయిడ్ గ్రంధి పనితీరులో లోపం ఏర్పడటం.
* స్త్రీలలోనే ఈ లోపం ఎందుకనే అంశంమీద అధ్య యనం జరుగుతోంది. వీరి శరీరంలో సెక్స్ హార్మోన్ల పాత్ర అధికంగా ఉంటుంది. వాటి ఉత్పత్తి, ప్రభావం వయసుతో మారుతుంటుంది. ఈ మార్పు మగవారిలో కన్నా స్పష్టంగా, ప్రత్యేకంగా స్త్రీలలో ఉంటుంది.
మరో కారణంగా స్త్రీ శరీర నిర్మాణంలోనే ఉన్న లోపాన్ని చెపుతున్నారు. వారిలోని రోగనిరోధక వ్యవస్థ ఏవో కారణాలవల్ల థైరాయిడ్ గ్రంధిని తమ శరీర అంశాలలో భాగంగా గుర్తించటంలో విఫలమవుతు న్నది. ఫలితంగా ఆ గ్రంధిమీద రోగనిరోధక వ్యవస్థ దాడిచేసి పనితీరును అడ్డుకుంటున్నది.
కన్పించే లక్షణాలు
థైరాయిడ్లో ఏర్పడే లోపం రెండు రకా లుగా ఉంటున్నది. ఒకటి గ్రంధి అతిగా పని చేయటం. మరొకటి పనిచేయాల్సిన మేర పనిచేయకపోవటం. ఈ మార్పువల్ల థైరా యిడ్ గ్రంధి హార్మోన్లు అతిగా స్రవించటం లేదా స్రవించాల్సినదానికన్నా తక్కువగా స్రవించటం జరుగుతుంది.
థైరాయిడ్ గ్రంధి పనితీరు అతిగా వుంటే ఆ స్థితిని హైపర్ థైరాయిడిజమ్ అంటారు. ఈ స్థితి రోగనిరోధక వ్యవస్థవల్ల ఏర్పడు తుంది. ఇటువంటి స్థితిని కనుక్కున్న గ్రేవస్ అనే పరిశోధకుడి పేరు మీద గ్రేవ్ స్వ్యాధి 'అని అంటారు.
గుండె అతివేగంగా కొట్టుకోవటం అతిగా చెమటపోయటం, కండరాల బలహీనత, గోళ్ళు మెత్తబడి రూపం దెబ్బతినటం, జుట్టు రాలిపోవటం, తరచుగా మలవిసర్జన, శరీరం బరువు తగ్గటం వంటి లక్షణాలు హైపర్ థైరాయిడిజంలో ఉంటాయి.
కళ్ళు ఎర్రబడటం, కళ్ళలోమంట, ఎండి నట్లుగా ఉండటం వంటి లక్షణాలు అదనంగా కనిపి స్తాయి. కంటిలోపల ఒత్తిడి పెరగటం, కళ్ళు ముందుకు నెట్టుకొచ్చినట్లుగా ఉండటం జరుగుతుంది.
కళ్ళను బలవంతంగా మూసుకోవాల్సిఉంటుంది. దీనితో ఇబ్బంది ఏర్పడుతుంది.
ఇలాంటి లక్షణాలకు తోడు స్త్రీలలో రుతుచక్రంలో తేడా వస్తుంది. 28 రోజులకన్నా ముందుగానే బహిష్టు వస్తుంది. అలాంటి సమయంలో విడుదలయ్యే రక్త పరిమాణం కూడా తగ్గుతుంది.
చలాకీగా వుండలేరు
అయితే హైపర్ థైరాయిడిజమ్ ఇబ్బందివచ్చేవారి సంఖ్య బాగా తక్కువే. హైపర్ థైరాయిడిజం వల్ల గ్రంధి లావుగా తయారై గొంతు భాగంలో ఉబ్బెత్తుగా కనిపి స్తుంది. ఇలాంటి స్థితిని గోయిటర్ అంటారు.
థైరాయిడ్ గ్రంధి సక్ర మంగా పనిచేయకపోవటం అనేది ఎక్కువమందిలో కనిపి స్తుంది. ఈ స్థితిని హైపో థైరా యిడిజమ్ అంటారు. ఆహా రంలో అయోడిన్ లోపించిన పుడు ఈ స్థితి ఏర్పడుతుంది.
హైపో థైరాయిడిజమ్ అనేది రోగనిరోధక వ్యవస్థ లోపంవల్ల కూడా ఏర్పడు తుంది. థైరాయిడ్ గ్రంధి మరిగ్గా పనిచేయనప్పుడు శరీరం పనితీరు మారిపోతుంది. చలాకీతనం ఉండదు. ముఖంలో వాపు కనిపిస్తుంది. బరువు పెరుగుతారు. ఒళ్ళంతా చల్లబడినట్లుగా అనిపిస్తుంది.
డిప్రెషన్కి గురయ్యేవారిలో 20 శాతం థైరాయిడ్ గ్రంధిలోపం కలవారేనని రుజువైంది. థైరాయిడ్ గ్రంధి హార్మోన్లను కృత్రిమంగా శరీరంలోకి ఎక్కించినపుడు
* డిప్రెషన్నుండి రోగులు బయటపడటాన్నిబట్టి థైరా యిడ్రంధి పాత్ర ధృవీకరించబడింది. థైరాయిడ్ గ్రంధి పనితీరు తగ్గటంవల్ల చర్మంలో
తేమ లోపిస్తుంది. గోళ్ళు పెళుసుగా తయారవుతాయి. కండరాల నొప్పులు, మలబద్ధకం, కండరాలుపట్టేయడం, శిరోజాలు రాలటం వంటి అనారోగ్య లక్ష ణాలు కనిపిస్తాయి.
గుండె కొట్టుకునే తీరులో మార్పు వస్తుంది. సాధారణ స్థాయికన్నా తక్కు వగా కొట్టుకుం టుంది.స్త్రీలలో థైరాయిడ్ గ్రంధి పనితీరు లోపంవల్ల రుతుచక్రం సక్రమంగా వుండదు. బహిష్టుల మధ్య కాలం అధికమవుతుంది.
హార్మోన్ల చికిత్స
థైరాయిడ్ గ్రంధి లోపం సరిదిద్దేందుకు హార్మోన్ల చికిత్స ఒక మార్గం. అయితే ఈ చికిత్స, నిపుణుడైన వైద్యుని చేత చేయించుకోవాలి. తగిన డోస్ ఇవ్వటంలోనే అసలు కీలకం ఉంటుంది. కాబట్టి పరీక్షించి వైద్యుడు నిర్ణ యించిన మందులు నిర్దేశించిన సమయానికి తీసుకోవటం అవసరం.
అవసరంమించి డోస్ తీసుకున్నా మహి ళల్లో ఎముకలు బలహీనపడతాయి. గుండె పనితీరులో లోపం ఏర్పడుతుంది. కొలెస్ట్రాల్ పెరుగుతుంది.కాబట్టి చికిత్సలో డాక్టర్ సూచ నలు అనుసరించటం ముఖ్యం.
హైపర్ థైరాయిడిజం ప్రదర్శిస్తున్న గ్రంధికి చికిత్సకై మొదటిస్థాయిలో మందులు వాడతారు. మందులతో, హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తారు. ధార్మికశక్తి కలిగిన అయోడిన్ ఉపయోగించి గ్రంధిని పనిచేయకుండా ఆపటం కూడా చికిత్సలో మార్గం.
సైడ్ ఎఫెక్ట్స్
ఇక చిట్టచివరిగా ఆపరేషన్ చేసి గ్రంధిని తొలగిస్తారు. గోయిటర్ స్థితిలో ఆపరేషన్ తప్ప మరో మార్గంలేదు. అయితే ఆపరేషన్లో థైరాయిడ్ పక్కనేవుండే పారా థైరాయిడ్ గ్రంధులు, స్వరపేటిక దెబ్బతినటమో లేక శాశ్వతంగా కోల్పోవటమో జరిగే ప్రమాదముంది. రేడియేషన్ థెరపీ చేసినా, ఆపరేషన్తో గ్రంధి తొల గించినా ఆగిపోయిన హార్మో న్ల ఉత్పత్తికి ప్రత్యామ్నా యంగా కృత్రిమంగా శరీరం లోకి ఇవ్వాల్సివుంటుంది.
థైరాయిడ్ గ్రంధి లోపాలు సరిదిద్దేందుకు చేసే చికిత్సలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువే. చర్మం ఎర్రగా పొంగటం, తక్కువ స్థాయి జ్వరం, కీళ్ళనొప్పులు, జీర్ణక్రియ లోపం వంటి ఇతర ఇబ్బందులు వస్తాయి.
కాబట్టి నలభైలలో పడిన తర్వాత ఇతర ఆరోగ్య పరీక్ష లతో పాటు థైరాయిడ్ గ్రంధి పనితీరు పరీక్షకూడా చేయిం చుకోవాలి.
Post a Comment