సైబర్ నేరాలు..... ఎన్నో రకాలు

 మహతి వాట్సాప్ కి ఒక సందేశం వచ్చింది . పార్ట్ టైం లేదా ఫుల్ టైం జాబ్ ఆఫర్ అని, కేవలం యూట్యూబ్ వీడియో కు లైక్  కొడితే 150/- చెల్లిస్తారని ఆ సందేశం సారాంశం .  . మహతి కి వచ్చినట్టే  ఇలాంటి సందేశాలు ఈమధ్య కాలం లో చాలా మంది కి వస్తూ ఉన్నాయి. చాల పెద్ద మొత్తం లో డబ్బులు దోచుకోవడానికి సైబర్ నేరగాళ్లు విసురుతున్న వల  ఈ సందేశాలు .  

యూట్యూబ్ వీడియో లకు , హోటల్ రివ్యూ లకు లేదా వారు చెప్పిన వెబ్సైటు లకు కేవలం లైక్  కొట్టి మీ కామెంట్ రాస్తే కాసులు మీ అకౌంట్ లో చేరతాయని మాయ మాటలు తో మిమ్మల్ని నమ్మిస్తారు . మొదట గా మీరు కొట్టే లైక్  లకు 150/- మీ అకౌంట్ లో జమ చేస్తారు . మీకు నమ్మకం వచ్చింది అంటే చాలు ఇక అప్పుడు మొదలు పెడతారు మోసగాళ్ల ఆట  . 


CYBER CRIMES IN INDIA 


మీరు ఒక వంద రూపాయలు చెల్లిస్తే మీకు బోనస్ తో కలిపి మీ మొత్తం మీకు వెంటనే మీ అకౌంట్ కు వేస్తామని , అలాగే కొత్త టాస్క్ లు కూడా అందిస్తామని చెప్తారు .  మిమ్మల్ని ఒక టెలిగ్రామ్చి గ్రూప్న్న కు చేర్చి అక్కడ కొత్త  వ్యక్తి ని పరిచయం చేస్తారు. అక్కడ ఆ వ్యక్తి మనల్ని మళ్ళీ ఒక కొత్త గ్రూప్ లో చేరుస్తాడు .  ఆ గ్రూప్ లో ఉన్న మిగిలిన వ్యక్తులు మాకు యాభై వేలు వచ్చాయి . మాకు ఇప్పుడే అంత వచ్చింది అంటూ సందేశాలు పెడుతూ ఉంటారు . కొత్తగా చేరిన మనకు ఇది అంతా నిజమే అనే భ్రమ కలుగుతుంది . వెంటనే  చిన్న   మొత్తాలు మాత్రమే అడుగుతున్నారు కదా అని మనం వేస్తాం . మోసగాళ్లు కూడా మీకు బోనస్ తో కలిపి నగదు మీ అకౌంట్ కు జమ చేస్తారు . ఆ తరువాత ఆ అమౌంట్ ను నెమ్మదిగా 5,000/- నుండి ప్రారంభించి ఆలా అలా పెంచుకుంటూ మీ నమ్మకాన్ని వారు పొందుతారు . సరిగ్గా ఒక పెద్ద కు  అమౌంట్ చేరగానే వారి దగ్గర ఆ అమౌంట్ ఉంచుకుని , మరికొంత కడితే మొత్తం నగదు ఒకేసారి మీకు జమ చేయబడుతుంది అని కాకమ్మ  కథలు  చెప్తారు . ఇక ఆ తర్వాత వీలైనంత దండుకుని మిమ్మల్ని బ్లాక్ చేస్తారు . 

చెన్నై , హైద్రాబాద్ , విశాఖపట్నం , విజయవాడ వంటి ఎన్నో నగరాలలో ఇప్పటికే ఎంతో మంది ఈ విధం గా మోసపోయారు . మీకు ఇటువంటి సందేశాలు వచ్చినప్పుడు ఆయా వ్యక్తులను బ్లాక్ చేయండి . అస్సలు ఇటువంటివాటిని నమ్మకండి . పొరబాటున నమ్మి పొసపోతే మీకు మీ నగదు ఎప్పటికీ రాదు . ఎక్కడ ఎక్కడో ఉంది నడిపిస్తూ ఇటువంటి మోసాలకు పాల్పడుతున్న మోసగాళ్లు బారిన పడకుండా ఉండాలి అంటే అవగాహనే సరి అయినా ఆయుధం . కాబట్టి సైబర్ నేరాలు జరుగుతున్నా తీరుపై అవగాహన పెంచుకోండి . 

సైబర్ నేరాల బారిన పడితే ఆర్ధికం గా నష్టంపోవడం మాత్రమే కాకుండా కొన్ని కొన్ని నేరాలలో మన పరువు కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది . మనం సైబర్ నేరాల బారిన పడి మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల కు ఫిర్యాదు  చేయాలి . 

సైబర్ నేరాలు ఎన్నో రకాలు 

సైబర్ మోసాలు ఎన్నో రకాలు . ఈ క్రింది తెలిపిన మోసాలు అన్ని సైబర్ క్రైమ్ గానే వస్తాయి . 

 పెట్టుబడి మోసాలు


 ట్రేడింగ్ మోసాలు


 OTP మోసాలు


 డెబిట్/క్రెడిట్ కార్డ్ మోసాలు


 సెక్స్టార్షన్/హనీ ట్రాప్


 డేటింగ్ మోసాలు


 హ్యాకింగ్ & అనధికార యాక్సెస్


 పోర్నోగ్రఫీ/ చైల్డ్ పోర్నోగ్రఫీ


 సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్.


 Whatsapp DP మోసాలు


 సైబర్ టెర్రరిజం


 ఇ-కామర్స్ మోసాలు


 సైబర్ స్టాకింగ్


 గుర్తింపు దొంగతనం


 డేటా దొంగతనం


 భీమా మోసాలు


 బహుమతి మోసాలు


 వైవాహిక మోసాలు


 రాజకీయ & మతపరమైన కేసులు


 OLX మోసాలు & మార్కెటింగ్ మోసాలు


 ఉద్యోగ మోసాలు


 కస్టమర్ కేర్ మోసాలు


 రుణ మోసాలు


 KYC మోసాలు


 వీసా మోసాలు


 Ransomware మోసాలు


 లాటరీ మోసాలు


 వ్యాపార మోసాలు


 సోర్స్ కోడ్ దొంగతనం


 గోప్యత మరియు గోప్యత మరియు ఇతర కంప్యూటర్ సంబంధిత నేరాల ఉల్లంఘన


 ఇమెయిల్ స్పూఫింగ్


 ఇమెయిల్ స్పామింగ్


 ఇమెయిల్ బాంబింగ్


 బెదిరింపు ఇమెయిల్‌లను పంపడం 


 ఇమెయిల్ మోసాలు


 ఫిషింగ్


 ఏదైనా ఇతర ఆన్‌లైన్ క్రైమ్


అవసరమైన సందర్భాలలో మీకు సహాయం చేయడానికి అందుబాటులో ఉంటామని హైదరాబాద్ సైబర్ క్రైం డిపార్ట్మెంట్ తమ వెబ్సైటు లో తెలియచేస్తూ ఉంది. వారి వెబ్సైటు లో సహాయం కొరకు ఉంచిన కాంటాక్ట్ వివరాలు :


 శ్రీమతి స్నేహ మెహ్రా, IPS


 డి వై.  పోలీస్ కమీషనర్,


 సైబర్ క్రైమ్స్, హైదరాబాద్


 ల్యాండ్‌లైన్:  040-27852283, 23242607


 ఇమెయిల్:dcpcybercrime-hyd@tspolice.gov.in



 ఆర్.జి.  శివ మారుతి (SHO)


 అసి.  పోలీస్ కమీషనర్,


 సైబర్ క్రైమ్స్, హైదరాబాద్


 మొబైల్: 8712665171


 గమనిక: సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ విషయంలో, తక్షణ రిపోర్టింగ్ కోసం 1930కి కాల్ చేయండి. (24*7)మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి:- https://cybercrime.gov.in/ 




Post a Comment

Previous Post Next Post