పచ్చని ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్టు కోనసీమ ఒడిలో కొలువై ఉన్న స్వామి అయినవిల్లి వినాయకుడు( Ainavilli vinayaka temple ) . ప్రతీరోజు వేల సంఖ్య లో ఈ ఆలయం ను భక్తులు సందర్శించుకుంటారు. ఎన్నో కోరికలతో ఆలయం లోకి అడుగు పెట్టి, తమ కోర్కెలను స్వామి ముందు ఉంచుతారు. తీరిన కోరికలకు మొక్కులు తీర్చుకుంటారు. ఒక్క కొబ్బరి కాయ కొట్టి కోరికలు అడిగితే ఈ స్వామి తప్పక తీరుస్తాడని ప్రసిద్ధి. అందుకే ఆంధ్రప్రదేశ్ లో కాణిపాకం తర్వాత అంత ప్రసిద్ధి చెందింది ఈ అయినవిల్లి వరసిద్ధి గణపతి ఆలయం ( Ainavilli varasiddi ganapathi temple)
![]() |
Ainavilli Vinayaka Temple |
కోరిన కోరికలు తీర్చే దేవుడు గా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. తూర్పు గోదావరి జిల్లా లో కోనసీమ లో అయినవిల్లి శ్రీ వర సిద్ధి వినాయకుని దేవాలయం ప్రధమ స్వయంభు క్షేత్రాలలో ఒకటి.
అయినవిల్లి ఆలయం చరిత్ర ( Ainavilli temple History)
ఈ అయినవిల్లి క్షేత్రం లో స్వామి కృతయుగం లో ఏక శిలా స్వయంభూగా ఆవిర్భవించారు.
దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞము చేసే ముందు ఇక్కడ స్వామిని పూజించక పోవడం వలెనే దక్ష యజ్ఞము భంగం ఐనది అని చెబుతూ ఉంటారు. అందువల్ల ఏ శుభ కార్యం తల పెట్టిన ముందుగా అయినవిల్లి స్వామి వారిని దర్శించుకుంటే తప్పకుండ ఆ కార్యం విజయవంతం అవుతుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
అయినవిల్లి వినాయక ఆలయం కాణిపాకం వినాయక ఆలయం కంటే పురాతనమైనది. అయినవిల్లి ఆలయం లో వినాయకుడు భక్తుల కోర్కెలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లు చున్నారు.
![]() |
Ainavilli varasiddi ganapathi temple |
వేద వ్యాసుడు దక్షిణ భారత దేశాన్ని సందర్శించడానికి ముందుగా ఈ క్షేత్రం లోనే వినాయకుడిని ప్రతిష్టించాడని స్థలపురాణం చెపుతున్నది.
అయినవిల్లి ఆలయం ఎలా చేరుకోవాలి? ( How to reach Ainavilli temple )
అయినవిల్లి ఆలయం చేరుకోవడానికి ముందుగా అమలాపురం చేరుకోవాలి. ఈ ఆలయం అమలాపురం నుండి 11 km దూరం లో ఉంది. అమలాపురం నుండి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడిపే బస్సులు ప్రతీ 15 నిముషాలకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రైవేట్ వాహనాలు, ఆటో లు కూడా అమలాపురం నుండి అయినవిల్లి వెళ్ళడానికి అందుబాటులో ఉంటాయి. రాజమండ్రి నుండి అమలాపురం 60km దూరం లో ఉంది. అలాగే కాకినాడ నుండి అమలాపురం 65 km దూరం లో ఉన్నది.
అయినవిల్లి ఆలయం చేరుకునే మార్గం లో రోడ్డు కి ఇరువైపులా పచ్చని కొబ్బరి చెట్లు మనకి స్వాగతం చెప్తూ ప్రకృతి ఒడిలోకి ఆహ్వానం పలుకుతున్నట్టు గా ఉంటాయి.
ఈ ఆలయం లో ప్రతీ రోజు భక్తులకు అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది.
మనసు కు ప్రశాంత ను అందిస్తూ భక్తుల కోరికలు తీర్చే ఐనవిల్లి వినాయక ఆలయం ను జీవితం లో ఒక్కసారి అయిన సందర్శించుకోవాలి.
Post a Comment