కావాల్సినవి :ఆమూర్ పొడి, జీలకర్ర పొడి -ఒక్కో
టేబుల్ స్పూన్ చొప్పున పసుపు, జీలకర్ర, చాట్ మసాలా- ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున కారం, ధనియాల పొడి, గరం మసాలా- ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున నల్ల ఉప్పు - ఒకటిన్నర టేబుల్ స్పూన్ మిరియాల పొడి - అర టీస్పూన్ మైదా లేదా గోధుమపిండి - రెండు కప్పులు పెరుగు - ముప్పావు కప్పు నూనె, నీళ్లు, ఉప్పు - సరిపడా నెయ్యి - ఒక టేబుల్ స్పూన్ ఉల్లిగడ్డలు -మూడు : అల్లం - చిన్న ముక్క వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది
పచ్చిమిర్చి - రెండు ; టొమాటో గుజ్జు - అర కప్పు వేడి నీళ్లు - అర లీటర్ గరం మసాలా, కసూరీ మేతీ ఒక్కోటి అర టీస్పూన్
చొప్పున : క్యాప్సికమ్ - ఒకటి
ఆలుగడ్డలు (ఉడికించి) - రెండు : బునా గ్రేవీ కోసం.. పాన్లో నెయ్యి, నూనె వేడి చేసి జీలకర్ర, ఉల్లిగడ్డ తరుగు వేగించాలి. అందులోనే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కలిపిన పేస్ట్ వేయాలి. ఇవి వేగాక కారం వేసి కలపాలి. ఒక కప్పులో అర కప్పు పెరుగు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ కారం, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కూడా అందులో వేసి మరోసారి కలపాలి. ఆ తర్వాత టొమాటో గుజ్జు, ఉప్పు వేసి కలిపి వేడి నీళ్లు పోసి కలపాలి. గరం మసాలా, కసూరీ మేతీ, కొత్తిమీర వేసి ఉడికించాలి.
తయారీ : పాన్లో నెయ్యి వేడి చేసి, ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ తరుగు, ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు వేసి చాట్ మసాలా చల్లాలి. దానిపై బునా గ్రేవీ వేసి, కొత్తిమీర చల్లి కలపాలి. రోటీపై ఫ్రాంకీ మసాలా చల్లి, దానిపై ఈ మిశ్రమం పెట్టి, ఉల్లిగడ్డ తరుగు చల్లి రోల్ చేయాలి. కావాలంటే గ్రీన్ చట్నీ కూడా వేసుకుని తింటే మరింత టేస్టీగా ఉంటుంది.
إرسال تعليق