గోరు చిక్కుడు ఎగ్ ఫ్రై (బూర్జీ )

 కావలసినవి : గోరుచిక్కుళ్ళు - 1/4 కేజీ, గుడ్లు -3, నూనె - 3 స్పూన్లు, వెల్లుల్లి పాయలు - 8, ఉల్లిపాయ, ఉప్పు, కారం - తగినంత


తయారీ


: శుభ్రం చేసిన గోరుచిక్కుడు కాయల్ని చిన్న ముక్కలుగా తరిగి ఉడకబెట్టుకోవాలి. బాండీలో తాలింపు పెట్టి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కరివేపాకు, ఉప్పు వేసి మూడు నిమిషాలు వేయించాలి. తర్వాత గోరుచిక్కుడు ముక్కలు వేయాలి. ముక్కల్లోని చెమ్మ పోయేవరకూ తిప్పుతూ ఐదు నిమిషాలు ఉడికించాలి. దంచిన వెల్లుల్లి వేసి, మరో మూడు నిమిషాలు వేయించి, కారం వేయాలి. పచ్చివాసన పోయేంత వరకూ వేయించి, బాండీలో ముక్కలను పక్కలకు తీసి మధ్యలో కోడిగుడ్ల సొన వేయాలి. దానిని కదపకుండా రెండు మూడు నిమిషాలు మూత పెట్టి, సీమ్లో ఉడికించాలి. తర్వాత చుట్టూ ఉన్న కూరను సొన పైకి వేసి, అటూ ఇటూ తిప్పుతూ రెండు నిమిషాలు వేయించాలి. అంతే గోరుచిక్కుడు ఎగ్ ఫ్రై రెడీ.

Post a Comment

Previous Post Next Post