గోరుచిక్కుడు కాయలు- 1/4 కేజీ, చింతపండు- 50గ్రా, కారం- 50గ్రా, ఉప్పు- 50గ్రా, నూనె- 75 గ్రా
పొడి కోసం: రెండు స్పూన్లు ఆవాలు, స్పూను మెంతులు దోరగా వేయించి, మెత్తగా చేసుకోవాలి. అర పొడి
చింతపండును వేడినీటిలో నానబెట్టి గుజ్జు తీసుకోవాలి.
తాలింపు కోసం : నూనెలో స్పూను ఆవాలు,
స్పూను జీలకర్ర, పదిహేను పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు, ఆరు ఎండుమిర్చి వేసి, తాలింపు పెట్టి అరనివ్వాలి.
తయారీ : ముందుగా గోరుచిక్కుళ్ళను శుభ్రంగా కడిగి పొడి గుడ్డతో తడి లేకుండా
తుడిచి, ఆరపెట్టాలి. గోరుచిక్కుడు కాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని నూనెలో బుడగలు రావడం ఆగిపోయేంత వరకూ వేయించాలి. స్పూను నూనెలో చింతపండు గుజ్జును ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి. చింతపండు గుజ్జు చల్లారిన తర్వాత ఉప్పు, కారం, సిద్ధంచేసుకున్న పొడి, గోరుచిక్కుడు ముక్కలు అన్నీ వేసి, బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని పొడిగా ఉన్న గాజుసీసాలో పెట్టుకోవాలి. అంతే కమ్మని గోరుచిక్కుళ్ళ నిల్వ పచ్చడి రెడీ!
Post a Comment