కావలసినవి : చిక్కుడు గింజలు - 1/4 కేజీ,
నూనె - 2 గరిటెలు, ఉల్లిపాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్ట్ - స్పూను, ఉప్పు - తగినంత, కారం - 11/2 స్పూను, పసుపు - 1/4 స్పూను,
తాలింపు దినుసులు: ఆవాలు-1/2 స్పూను, జీలకర్ర -1/2 స్పూను, ఎండుమిర్చి - 2, నువ్వులు - స్పూను
చిక్కుడు గింజల కూర తయారు చేసే విధానం : బాండీలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నువ్వులు వేసి తాలింపు పెట్టాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి, తాలింపులో కలిసేలా గరిటెతో తిప్పాలి. తర్వాత చాలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి నిమిషం వేయించి, చిక్కుడు గింజలు వేయాలి. ఒక నిమిషం తిప్పుతూ ఉడికించాలి.
ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి మరో నిమిషం ఉడికించాలి. తర్వాత టమోటా ముక్కలు, చిన్న గ్లాసు నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించాలి. కూర దగ్గరకు వచ్చాక, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం వేయాలి. ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి దింపేయాలి. అంతే రుచికరమైన చిక్కుడు గింజల కూర రెడీ.
Post a Comment