ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే
ఓటరు జాబితాలో(voter list) మీ పేరు ఉన్నప్పటికీ, మీకు ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే, మీరు ఇతర 12 ఐడీ కార్డులలో దేని సహాయంతోనైనా కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అంతేకాదు కొత్తగా ఓటర్ ఐడి కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఓటర్ ఐడి రాకున్నా కూడా మీ ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చు. ఎన్నికల కమిషన్ ప్రకారం ఓటర్ ఐడితో పాటు ఓటు వేయడానికి ఎన్నికల సంఘం 12 ఇతర ఐడీ కార్డులను తీసుకెళ్లవచ్చని తెలిపింది. వాటిలో ఏదైనా పత్రాలు ఉంటే ఓటింగ్ వేయవచ్చని స్పష్టం చేసింది. కాబట్టి మీరు ఓటరు కార్డు లేకున్నా కూడా చింతిచాల్సిన పనిలేదు. అందుకోసం కావాల్సిన పత్రాలు ఏంటో ఇక్కడ చుద్దాం.
ఓటరు కార్డు లేకుండా చూపించాల్సిన 12 ఇతర ఐడీ కార్డులు
1. పాన్ కార్డ్
2. ఆధార్ కార్డ్
3. ప్రత్యేక వైకల్యం ID అంటే UDID ID
4. సర్వీస్ ID కార్డ్
5. పోస్టాఫీసు, బ్యాంకు ద్వారా జారీ చేయబడిన పాస్‌బుక్
6. కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్
7. డ్రైవింగ్ లైసెన్స్
8. పాస్ పోర్ట్
9. జాతీయ జనాభా రిజిస్టర్ (NPR) కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డ్
10. పెన్షన్ కార్డు
11. MP-MLA, MLC కోసం జారీ చేసిన అధికారిక ID కార్డ్
12. MNREGA జాబ్ కార్డ్
Post a Comment