Credit Cards క్రెడిట్ కార్డుదారులకు SBI బ్యాడ్ న్యూస్.. ఇకపై ఆ బెనిఫిట్స్ కట్
SBI News: దేశంలో అతిపెద్ద ఆర్థిక సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డుల కస్టమర్లకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. వివిధ కార్డుల ద్వారా జరిపే పేమెంట్స్ ద్వారా ఇక నుంచి యూజర్లు అదనపు లబ్ధి పొందే అవకాశం లేకుండా పోనుంది
![]() |
SBI CREDIT CARDS |
ప్రముఖ క్రెడిట్ కార్డ్ జారీ సంస్థ SBI కార్డ్ తన రివార్డ్ ప్రోగ్రామ్‌లో గణనీయమైన మార్పులను ప్రకటించింది. ఈ నిర్ణయంతో వివిధ రకాల క్రెడిట్ కార్డుదారులు ప్రభావితం కానున్నారు. జూన్ 2024 నుంచి నిర్దిష్ట SBI క్రెడిట్ కార్డ్‌లతో జరిపే ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డ్ పాయింట్‌లు వర్తించవంటూ కీలక ప్రకటన చేసింది.
రివార్డుల నిర్మాణాన్ని క్రమబద్ధీకరించడం మరియు కార్డ్ హోల్డర్‌ల అవసరాలను మెరుగ్గా సర్దుబాటు చేయడమే ఈ సర్దుబాటు లక్ష్యమని SBI కార్డ్ తెలిపింది. విభిన్న శ్రేణిలోని SBI క్రెడిట్ కార్డ్‌లు ఈ నిర్ణయంతో ప్రభావితం కానున్నాయి. ఈ కార్డులు ప్రీమియం ఆఫర్‌లతో పాటు నిర్దిష్ట కస్టమర్ సెగ్మెంట్‌లకు భారీ ప్రయోజనాలు అందిస్తున్నాయి.
దాదాపు 50 రకాల SBI క్రెడిట్ కార్డ్‌లు ప్రభావితం కానున్నాయి. ఆధునిక ప్రయాణీకుల డైనమిక్ డిమాండ్‌లను తీర్చాలనే లక్ష్యంతో ట్రావెల్-ఫోకస్డ్ కోర్ క్రెడిట్ కార్డ్ సిరీస్, MILES కార్డుల పరిచయం తర్వాత SBI ఈ నిర్ణయం తీసుకుంది. ఫైనాన్షియల్ ల్యాండ్‌స్కేప్ అభివృద్ధికి అనుగుణంగా కస్టమర్ సెంట్రిక్ సొల్యూషన్స్ తీసుకువచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు SBI చెబుతోంది.
Post a Comment