ఆనియన్స్తో ఫ్రై..చిక్కుళ్ళు

 



కావలసినవి : చిక్కుడు కాయలు - 1/4 కేజీ,


ఉల్లిపాయ - ఒకటి, పసుపు - 1/4 స్పూను, ఉప్పు తగినంత, అల్లంవెల్లుల్లి పేస్ట్- స్పూను, పచ్చిమిర్చి - 3, ఎండుకొబ్బరి తురుము - 2 స్పూన్లు, కారం - స్పూను, రసం పొడి/సాంబారు పొడి- 2 స్పూన్లు


తాలింపు దినుసులు : నూనె - 2 గరిటెలు, (మినప్పప్పు, పచ్చి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు- 1/2 స్పూను చొప్పున) ఎండుమిర్చి -2, కరివేపాకు రెబ్బలు -2


తయారీ : శుభ్రం చేసుకున్న చిక్కుడు కాయలను


ముక్కలుగా చేసుకోవాలి. ఉల్లిపాయను నిలువుగా కట్ చేసుకుని, బాండీలో నూనె వేడిచేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకూ వేయించుకుని పక్కనుంచుకోవాలి. అదే నూనెలో తాలింపు దినుసులు వేసి, అవి వేగిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసి, ఒకసారి తిప్పి మూతపెట్టి ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత పసుపు, ఉప్పు వేసి మధ్య మధ్యలో తిప్పుతూ మరో ఐదు నిమిషాలు వేయించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి, నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, ఎండుకొబ్బరి తురుము, ముందుగా వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్, కారం, రసం పొడి వేసి, కూరంతా తిప్పుతూ రెండు నిమిషాలు వేయించాలి. అంతే ఘుమఘుమలాడే చిక్కుడుకాయలతో వెరైటీ ఫ్రై రెడీ.

Post a Comment

Previous Post Next Post