అమెజాన్ లో 32,245 కె ఐఫోన్ వివరాలు ఇవే!

 iPhone 15 Offers : అమెజాన్‌లో రూ. 32,245 కే ఐఫోన్ 15 .. ఆఫర్ వివరాలివే..


యాపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంటుంది. ధర ఎక్కువే అయినా నాణ్యత బాగుంటుంది కాబట్టి వీటిని కొనుగోలు చేసేందుకు స్మార్ట్ ఫోన్ ప్రియులు ఏమాత్రం వెనుకాడరు. ఆపిల్ నుంచి గతేడాది ఐఫోన్ 15 రిలీజ్ అయింది. 128 జీబీ స్టోరేజీ బ్లాక్ వేరియంట్ ధర రూ. 79,900 గా ఉంది. అయితే ఇప్పుడు అమెజాన్ ఈ ఫోన్ ను 9 శాతం డిస్కౌంట్ ధరతో రూ. 73,100 కే విక్రయిస్తోంది. అంతేగాక ప్రస్తుతమున్న అన్ని ఆఫర్లను ఉపయోగించుకుంటే ఈ ఫోన్ ను కేవలం రూ. 32,245 కే సొంతం చేసుకోవచ్చు. అదేలానో ఇప్పుడు చూద్దాం.

Iphone 15 


ఐఫోన్ 15 బ్లాక్ వేరియంట్ డిస్కౌంట్లో రూ. 73,100 కు లభిస్తోంది. మంచి కండీషన్ లో ఉన్న మీ పాత ఫోన్ ఎక్స్చేంజీ చేసుకుంటే అదనంగా రూ. 33,400 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అప్పుడు ఫోన్ ధర రూ. 39,700 అవుతుంది. దీనికి అదనంగా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ ఉన్నవారికి స్పెషల్ డిస్కౌంట్ రూ. 7,455 ఉంటుంది. అప్పుడు ఐఫోన్ 15 ధర రూ. 32,245 మాత్రమే అవుతుంది.


అమెజాన్ పే క్రెడియ్ కార్డు ఉన్నవారు రూ. 47,940 విలువ చేసే వాటిని కొనుగోలు చేస్తే రూ. 4,000 ఇన్ స్టాంట్ డిస్కౌంట్ ఉంది. దీనికి అదనంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి 5 శాతం స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. మొత్తంగా వీరికి ఐఫోన్ 15 కొనుగోలు చేస్తే రూ. 7,455 డిస్కంట్ లభిస్తుంది. కాబ్టటి అతి తక్కువ ధరకే ఐఫోన్ 15 ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఐఫోన్ 15 ఫీచర్లు

ఐఫోన్ 15 6.1 అంగుళాల డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. డైనమిక్ ఐలాండ్ నాచ్ తో ఈ ఫోన్ ను రూపొందించింది ఆపిల్. ఐఫోన్ 14 ప్రో మోడళ్లలో ఈ ఫీచర్ ఉండేది. అలాగే ఐఫోన్ 15 48 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఏ16 బయోనిక్ చిప్ ప్రాసెసర్ ను ఇందులో ఉపయోగించారు. తొలిసారి యూఎస్బీ టైప్ సీ పోర్టుతో ఈ ఫోన్ ను రూపొందించింది కంపెనీ. ఇతర ఫోన్లతో పోల్చితే ఐఫోన్లలో కెమెరా క్వాలిటీ, ప్రమాణాలు అద్భుతంగా ఉంటాయి. అందుకే స్మార్ట్ ఫోన్ లవర్స్ ధర గురించి ఆలోచించకుండా వీటిని కొనుగోలు చేస్తారు. Buy Now @ amazon 


CHECK PRICE NOW 

Post a Comment

Previous Post Next Post